నకిలీ భూపత్రాలు సృష్టించి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో నకిలి భూపత్రాలు సృష్టించి విక్రయిస్తున్న ముఠాను ఎల్‌బినగర్ పోలీసులు అరెస్టు చేశారు. గత తొమ్మిదేళ్లుగా ఈ ముఠా మోసాలు చేస్తూ వస్తుంది. మొత్తం 13 మందిలో ఆరుగురిని అరెస్టు చేయగా.. ఏడుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాను ప్రకాశ్, సాగరిక దంపతులు సరూర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సాత్విక్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో నోటరీ షాపు నిర్వహిస్తున్నారు. అధిక డబ్బులకు ఆశపడి నకిలి బర్త్, ఇన్‌కమ్, క్యాస్ట్ సమా భూమి క్రయవిక్రయాలకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్ఉల, ఫోర్జరి పత్రాలు సృష్టించేవారు. దీనికోసం వారు కొందరు వ్యక్తులతో చేతులు కలిపి ఓ వ్యవస్థనే ఏర్పాటు చేశారు. గత తొమ్మిదేళ్లుగా ఈ దందా సాగుతున్నట్లు గుర్తించామని రాచకొండ సిపి వెల్లడించారు. ఒక్కొక్క నకిలి డాక్యుమెంట్ను రూ.5వేల నుండి రూ.20 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.