భద్రాచలం చెక్‌పోస్ట్ వద్ద రూ.30లక్షల గంజాయి పట్టివేత

భద్రాచలం (CLiC2NEWS): కొత్తగూడెం జిల్లా భద్రాచలం చెక్‌పోస్ట్ వద్ద 118 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుంది. ఇల్లందుకు చెందిన ముగ్గురు యువకులు ఒడిశాలో గంజాయిని కొని తరలిస్తున్నారు. భద్రాచలం వద్ద నిర్వహించిన తనిఖీల్లో రెండు ఆటోలలో గంజాయిని గుర్తించారు. ముగ్గురిలో ఒకరు మైనర్ బాలుడు, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారైనట్లు సమాచారం. గంజాయిని విక్రయిస్తున్నా, రవాణా చేస్తున్నట్లు తెలిసినా.. పోలీసులుకు సమాచారం ఇవ్వాలని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు.