ప్రజల ఆరాధ్యదైవం శ్రీగట్టు మైసమ్మ..

ఘట్కేసర్ (CLiC2NEWS): ఘట్కేసర్ మునిసిపల్ ప్రజల ఆరాధ్యదైవం శ్రీగట్టుమైసమ్మ తల్లి జాతర ఎంతో కన్నుల పండుగగా జరిగింది.. తెలంగాణా లోని పలు ప్రాంతాలనుండి భక్తులు తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. ప్రజల కోర్కెలను తీర్చే గట్టుమైసమ్మ తల్లిని భక్తుల కొంగుబంగారమని కొనియాడారు, ఈ కార్యక్రమానికి ఎండోమెంట్ దేవాలయ ట్రస్ట్ చైర్మన్ మామిళ్ల చిత్తారి యాదవ్, డైరెక్టర్లు బర్ల సరోజ హరిశంకర్, కందకట్ల పద్మా రెడ్డి, ఎర్రోళ్ళ మైసయ్య, ఆర్యవైశ్య మేడ్చల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, అడ్వకేట్ బచ్చు మమతా ప్రమోద్ అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో పూజలు నిర్వహించారు.