GHMCలో హోం ఐసోలేషన్ కిట్ల కోసం సంప్రదించాల్సిన నంబర్..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌లో కూడా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలో కరోనా కట్టడి కోసం జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ బాధితులకు హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు లక్ష హోం ఐసోలేషన్ కిట్లను జీహెచ్ఎంసీ కొనుగోలు చేసింది. ఈ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. హోం ఐసోలేషన్ కిట్ల కోసం కరోనా పాజిటివ్ బాధితులు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 040 – 2111 1111.