జిహెచ్ఎంసి ప‌రిధిలో ఆస్థిప‌న్ను బ‌కాయిదారుల‌కు శుభ‌వార్త‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఆస్తిప‌న్ను బ‌కాయిలు వ‌సూలు ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఒటిఎస్ ప‌థ‌కాన్ని మ‌రోసారి ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. 90% వ‌డ్డీ మాఫీతో పన్ను బకాయిలు మొత్తం ఒకేసారి చెల్లించేలా వెసులుబాటు క‌ల్పించ‌నుంది. ఈ ప‌థ‌కాన్ని ఉప‌యోగించుకొని న‌గ‌రంలోని ఆస్తి ప‌న్ను మొండి బకాయిలున్న వారు ప‌న్ను చెల్లించాల‌ని సూచించారు. ఈ మేర‌కు పుర‌పాల‌క శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి దాన కిషోర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ వాసుల‌కు ఆస్తి ప‌న్ను బాకాయిలు చెల్లించేందుకు వెసులుబాటు క‌ల్పించారు. 2024-25 ఆర్ధిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ఒటిఎస్ మొత్తం ప‌న్నుతో పాటు వ‌డ్డీ 10% చెల్లిస్తే స‌రిపోతుంద‌ని వెల్ల‌డించారు. గ‌తేడాది ప్ర‌వేశ‌పెట్టిన ఈ ఒటిఎస్ ప‌థ‌కం వ‌ల‌న సుమారు ల‌క్ష మంది వినియోగ‌దారులు ఆస్తి ప‌న్ను చెల్లించిన‌ట్లు స‌మాచారం. ఈ సారి కూడా అదే త‌ర‌హాలో రూ.2వేల కోట్లు వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వం దీనికి అంగీక‌రించ‌డంతో ఒటిఎస్‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.