రూ.2వేల కోట్లు దాటిన జిహెచ్ఎమ్‌సి ఆస్తి పన్ను వసూళ్లు..

హైదరాబాద్ (CLiC2NEWS): గ్రేటర్ హైదరాబాద్ ఆస్తి పన్ను వసూళ్లు రూ.2వేల కోట్లు దాటాయి. జిహెచ్ ఎంసి చరిత్రలోనే తొలిసారిగా ఆస్తిపన్ను వసూళ్లు రూ.2వేల కోట్లు దాటింది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.2012.36 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు జిహెచ్ ఎంసి వెల్లడించింది. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఒటిఎస్) పథకం కింద రూ.465.07 కోట్లు వసూలైనట్లు పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆస్తిపన్ను బకాయిదారుల నుండి పన్ను వసూలు చేసేందుకు మున్సిపల్ వాఖ ఒటిఎస్ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.