జీతాలు కావాలంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఇవ్వండి
పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ కీలక నిర్ణయం

చండీగడ్ (CLiC2NEWS): దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజకూ పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ప‌్రభుత్వ ఉద్యోగులు తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోతే ఇకపై జీతం పొందలేరని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వేతనం తీసుకోవాలంటే ప్రతి ఉద్యోగి కరోనా టీకా వేయించుకున్న సర్టిఫికెట్‌లను ప్రభుత్వ జాబ్ పోర్టల్‌లో ఆప్‌లోడ్ చేయాలని సూచించింది. పంజాబ్‌లో ఇప్పటి వరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు.
క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఢిల్లీ సర్కార్ నిషేధాజ్ఞలు