క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఢిల్లీ స‌ర్కార్‌ నిషేధాజ్ఞ‌లు

ఢిల్లి (CLiC2NEWS): ఢిల్లి ప్ర‌భుత్వం క్రిస్మ‌స్, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించింది. కరోనా కొత్త‌వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఎక్క‌వ‌వుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. ఢిల్లిలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కి చేరింది. దీంతో ప్ర‌భుత్వం క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల లో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, బ‌హిరంగా స‌మావేశాల‌పై నిషేధాజ్ఞ‌లు విధించింది. ఢిల్లి పాల‌నా యంత్రాంగం, పోలీసులు ఈ ఆదేశాలు పాటించాల‌ని, మాస్క్ ధ‌రించ‌ని వినియోగ‌దారుల్ని అనుమ‌తించ‌వ‌ద్ద‌ని మార్కెట్ ట్రేడ్ అసోసియేష‌న్‌కు ఆదేశాలు జారీచేసింది.

Leave A Reply

Your email address will not be published.