ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు..

గోదావరిఖని (CLiC2NEWS): నేర ప్రవర్తన మార్చుకోకపోతే పిడి యాక్ట్ తప్పవని పెద్దపల్లి ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ తెలిపారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 60 మంది రౌడీషీటర్లుకు డిసిపి అఖిల్ మహాజన్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారి జీవన విధానంతో పాటు, ప్రస్తుత వారి కుటుంబం స్థితిగతులను గురించి అడిగి తెలుసుకుని, గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు నేర ప్రవుత్తిని వీడి మంచి ప్రవర్తనతో జీవించాలన్నారు. శాంతి భద్రతలకు మరియు ప్రజల స్వేచ్ఛ, హక్కులకు భంగం కలిగిస్తూ వారిపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, తీరు మారకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, షీటర్లపై పిడి యాక్ట్ పెట్టేందుకు సైతం వెనకాడమన్నారు. ప్రతి 6 నెలలకు ఒక్కసారి చెడు ప్రవర్తన కలిగిన వారిని బైన్డోవర్ చేయడం వలన వారిపై పోలీస్ నిఘా ఉంటుంది కాబట్టి వారి కదలికలు మరియు ప్రవర్తన గురించిన విషయాలు తెలుసుకొవడం జరుగుతుంది. బైండొవర్ కాలంలో ఏదైనా నేరంకు పాల్పడినట్లు అయితే జరిమానా తో పాటు గా జైలు శిక్ష కూడా పడడం జరుగుతుంది.
అదేవిదంగా గతంలో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు పాల్పడి పలు నేరాల్లో పాలుపంచుకున్న వ్యక్తుల పై రౌడీషీట్స్, సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరిగిందని అలాగే ప్రస్తుతం కోర్టులో ట్రయల్ నడుసున్న రౌడీ షీట్లకు శిక్షలు పడేలా చూస్తామని అన్నారు.
ఈ సమావేశంలో గోదావరిఖని సబ్ డివిజన్ ఎసిపి గిరి ప్రసాద్ , గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ లు రమేష్ బాబు,రాజ్ కుమార్, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు , మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ ,రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మి నారాయణ,సబ్ డివిజన్ ఎస్సైలు పాల్గొన్నారు.