ఆయిల్‌ఫాం తోటలో దొరికిన బంగారు నాణేలు..!
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/GOLD-COIN-FOUND-IN-AGRICULTURE-LAND.jpg)
ఏలూరు (CLiC2NEWS): పొలంలో పైప్‌లైన్ వేసేందుకు తవ్వకాలు జరుపుతుండగా బంగారు నాణేలు గల మట్టి కుండ బయటపడింది. దీనిలో 18 బంగారు నాణేలు ఉన్నాయి. ఒక్కొక్కటి 8 గ్రాములకుపైగా బరువున్నదని సమాచారం. ఏలూరు జిల్లా కొయ్యాలగూడెం మండలం ఏడువాడలపాలెం గ్రామంలో ఆయల్‌ఫాం తోటలో ఈ నాణేలు బయటపడ్డాయి. తోట యజమాని ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దారు వచ్చి వాటిని పరశీలించారు. ఈ నాణేలు రెండు శతాబ్దాల క్రితం నాటివిగా అధికారులు భావిస్తున్నారు.