శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్ (CLiC2NEWS): శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ నుండి అక్రమంగా తరలిస్తున్న బంగారం కస్టమ్స్ అధికారలు పట్టుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికుడిని విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద నుండి 478 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించారు. వాటికి ఎటువంటి రశీదులు లేకపోవడంతో అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు. బంగారు ఆభరణాల విలుల రూ. 24.82 లక్షలు ఉంటుందని తెలిపారు.