రామగుండం ఎన్‌టిపిసికి గోల్డెన్ పికాక్ అవార్డు..
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/GOLDEN-PEOCOCK-AWARD-TO-NTPC.jpg)
కరీంనగర్ (CLiC2NEWS): రామగుండం ఎన్‌టిపిసి 2023 సంవత్సరానికి గాను గోల్డెన్ పికాక్ అవార్డును సొంతం చేసుకుంది.
బెంగళూరులో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడి) ఈ అవార్డును అందజేశారు. రామగుండం ఎన్‌టిపిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దేశంలోనే అతిపెద్ద 100 మెగా వాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటును నిర్మించడం.. యాదాద్రి తరమా ఫారెస్ట్ ఏర్పటుతో గ్రీన్ ఎనర్జీ, సిఒటు ఉద్గారాల తగ్గింపులో సాధించిన ప్రతిభకు గాను ఐఒడి పురాస్కారాన్ని అందజేసింది.