GoodNews: తెలంగాణ‌లో రేష‌న్‌కార్డుపై ప్ర‌తీ ఒక్క‌రికి 15 కిలోల ఉచిత బియ్యం

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ సంక్షోభం స‌మ‌యంలో రాష్ట్ర స‌ర్కార్ పేద‌ల‌ను అండ‌గా నిలిస్తోంది. లాక్‌డౌన్‌తో ప‌లువురు పేద‌లు ఉపాధి కోల్పోయి తిన‌డానికి తిండిలేక‌.. దాత‌ల కోసం ఎదురుచూసే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ పేద‌ల‌ను ఆదుకునేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జూన్ లో ప్ర‌తీ వ్య‌క్తికి 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అంద‌జేయ‌నున్నారు. ఈ మేర‌కు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో రాష్ట్రంలోని 2 కోట్ల 79లక్షల 24వేల 300 మందికి లబ్ధి చేకూర‌నుంది.

Leave A Reply

Your email address will not be published.