ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు.. 14 బోగీలు బోల్తా!

ప‌ట్నా (CLiC2NEWS): బీహార్‌లోని నలంద ప్రాంతంలో ఓ గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. బ‌ర్హ్‌లోని నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌కు బొగ్గు లోడుతో వెళ్తున్న రైలు న‌లంద ఏరియాలోని నేక్‌పూర్ వ‌ద్ద ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లో రైలు 14 బోగీలు బోల్తా ప‌డ్డాయి. దీంతో ఈ మార్గం గుండా వెళ్లే రైళ్ల‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

ప‌ట్టాలు త‌ప్పిన రైలు బోగీల‌ను తొల‌గించేందుకు.. తిరిగి ప‌ట్టాల‌ను పున‌రుద్ధ‌రించేందుకు 12 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వేస్ అసిస్టెంట్ ఇంజినీర్ వీకే సిన్హా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.