సిరిసిల్ల నేత కళాకారుడికి గ‌వ‌ర్న‌ర్ అభినంద‌న‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాజ‌న్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత క‌ళాకారుడు వెల్డి హ‌రిప్ర‌సాద్ జి-20 చిహ్నం త‌యారు చేసినందుకుగాను ఇటీవ‌ల ప్ర‌ధాన‌మంత్రి మోడీ ప్ర‌శంస‌లు అందుకున్న విష‌యం తెలిసిన‌దే. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ హ‌రిప్రాసాద్‌ను రాజ్‌భ‌వ‌న్‌కు ఆహ్వానించి స‌త్క‌రించారు. హ‌రిప్ర‌సాద్ దంప‌తులు గ‌వ‌ర్న‌ర్‌ను అగ్గిపెట్టెలో ఇమ‌డే శాలువాతో సన్మానించారు. ఇంకా బుల్లి చేనేత మ‌గ్గంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై చిత్రాన్ని నేసి అంద‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.