త్రిపుర గవర్నర్‌కు మిజోరం గవర్నర్‌గా అదనపు బాధ్యతలు

ఢిల్లీ (CLiC2NEWS): ప్రస్తుతం త్రిపుర గవర్నర్‌గా ఉన్న నల్లు ఇంద్రసేనారెడ్డికి మిజోరం గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఆప్పగించారు. మిజోరం గవర్నర్‌గా ఉన్నటువంటి కంభంపాటి హరిబాబు కొద్ది రోజులుగా సెలవులో ఉన్న నేపథ్యంలో ఇంద్రసేనారెడ్డికి అదనంగా బాధ్తలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గతేడాది అక్టోబర్‌లో త్రిపుర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈయన తెలంగాణలోని సూర్యపేట జిల్లాలో జన్మించిన ఇంద్రసేనారెడ్డి 1983, 1985, 1999లో జరిగిన ఎన్నికల్లో మలక్‌పేట నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2003 నుండి 07 వరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2014లో పార్టి జాతీయ కార్యదర్శిగా.. 2020 లో పార్టి జాతీయ కమిటి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు.