హుస్సేన్ సాగ‌ర్ గురించి గొప్ప‌గా విన్నా: సిజె

ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యత గా వ్యవహరించాలి

హైద‌రాబాద్‌ (CLiC2NEWS):నాంప‌ల్లిలోని గ‌గ‌న్ విహార్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్ర‌ణ అప్పిలేట్ అథారిటి నూత‌న కార్యాల‌యాన్ని ఛైర్మ‌న్ జ‌స్టిస్ ప్ర‌కాశ్‌తో క‌ల‌సి సిజె ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సిజె జ‌స్టిస్ స‌తీష్ చంద్ర శ‌ర్మ మాట్లాడుతూ..ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించేందుకు ప్ర‌భుత్వంపై బాధ్య‌త వేయ‌కుండా ప్ర‌తి పౌరుడు బాధ్య‌త‌గా ఉండాల‌ని అన్నారు. `హైద‌రాబాదు వ‌చ్చిన‌పుడు ఇక్క‌డ అంద‌మైన హుస్సేన్ సాగ‌ర్ ఉంద‌ని విన్నాను. కాని అక్క‌డికి వెళ్లి 5 నిముషాలు కూడా ఉండ‌లేక పోయాన‌ని అన్నారు. ప‌ర్యావ‌ర‌ణానికి మ‌నం ఏవిధంగా హాని చేస్తున్నామో ఇక్య‌డే అర్థ‌మ‌వుతోంది. ప్ర‌జ‌లంద‌రికీ నా అభ్య‌ర్థ‌న.. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత గా కాలుష్య నియంత్రణకు పాటుపడాలి` అని చీఫ్ జస్టిస్ విజ్ఞ‌ప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.