తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి!
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ పదవి కోసం టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రెండవ సారి శాసన మండలి ఛైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో మాదిరిగానే సభను హుందాగా నడిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ఎమ్మోల్యే కోటా నుండి శాసనమండలికి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికయ్యారు. 2019, సెప్టెంబర్ 11న మొదటిసారిగా శాసన మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2021 జూన్ మొదటి వారం వరకు ఆయన మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పదవీ కాలం ముగియడంతో.. ప్రొటెం ఛైర్మన్‌గా భూపాల్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం మండలి ప్రొటెం ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ కొనసాగుతున్నారు.