కాంగ్రెస్‌లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు
![](https://clic2news.com/wp-content/uploads/2024/04/Amith-reddy-join-in-congress.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): భారతీయ రాష్ట్ర సమితి నుండి కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు కీలక నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అనంతరం సిఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో అమిత్ రెడ్డి కలిశారు. కార్యక్రమంలో ఎఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి , మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పాల్గొన్నారు.