విశాఖ: జివిఎంసి ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి హవా..

విశాఖ (CLiC2NEWS): విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) స్థాయి సంఘం ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి విజయకేతనం ఎగురవేసింది. వరుసగా మూడుసార్లు హాట్రిక్ కొట్టిన వైఎస్ఆర్‌సిపి ఈ సారి క్లీన్‌స్వీప్ అయ్యింది. ఎన్‌డిఎ కూటమి స్థాయి సంఘం ఎన్నికల్లో పదికి పది స్థౄనాలు గెలుచుకొని ఘన విజయం సాధించింది. ఈ ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు స్థాయి సంఘం ఎన్నికలు నిర్వహించారు. పది స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కొక్కరికి 10 ఓట్లు వేసే అవకాశం ఉంది. దీంతో మొత్తం 960 ఓట్లు పోలయ్యాయి. పది స్థానాలకు కూటమి తరపున టిడిపి, వైఎస్ ఆర్‌సిపి పోటీ చేయగా.. 10 మంది టిడిపి అభ్యర్థులు అన్ని స్థానాలు గెలుచుకున్నారు. దీంతో గెలుపు సంబరాలు జరుపుకుంటున్నారు.