సీతారాముల కాళ్యాణ మహోత్సవానికి చేనేత పట్టు వస్త్రాలు
భద్రాచలం (CLiC2NEWS): భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మొదటిసారి చేనేత పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుండి మగ్గాల్ని తెచ్చి రామదాసు ధ్యాన మందిరంలో పోచంపల్లి పట్టు వస్త్రాల్ని నేస్తున్నారు. సికింద్రాబాద్ గణేశ్ ఆలయ ఛైర్మన్, పద్మశాలిసంఘ నిష్టతో పనిచేస్తున్నారు,. సీతమ్మకు చీర, రామలక్ష్మణులకు పంచె, కండువాలను 4,600 పట్టు పోగులతో తయారు చేస్తున్నారు. పసుపు, నీలం, గులాబి తదితర రంగుల్లో రెండు కిలోల బరువుతో నేసే వస్త్రాల్ని శ్రీరామ నవమి రోజున దేవతామూర్తులకు అలంకరించనున్నారు. ఇందులో వందకు పైగా డిజైన్లను ఉపయోగిస్తున్నారు.