కొత్త ఆశలు తీర్చే కల్పవల్లి.. ‘2023’
కొత్త ఆశలు తీర్చే కల్పవల్లి 2023
గతిస్తున్న సంవత్సరంలోని గాయాలను
చెరిపివేస్తూ,నూతన జ్ఞాపకాలను పదిల
పరచుకునేందుకు ,నిషి రాత్రిలో వెలుగుల మోలకలను పదిలంగానే మోసుకొస్తుంది క్రొత్తవత్సరం.
ఉన్నత శిఖరాలకు ద్వారాలను తెరుస్తూ
ఉజ్వల భౌషత్త్ కార్యాచరణ లిఖించుకోమంటూ,
చీకటిని తరిమివేస్తూ..
వెలుగుల ఆనందం హేళితో అడుగిడుతుంది నూతన వత్సరం.
సంక్రాంతి సంబరాలు,
ఉగాది పచ్చడి విశిష్టతను తనలోనే నిలుపుకుని
క్రొంగొత్త ఆశలకు ఊపిరి పోస్తూ..
నవకన్యలా కదలి వచ్చేస్తుంది మరో నూతన వత్సరం
ప్రతి తరుణిలో నూతనోత్సాహం నింపేస్తూ..
వచ్చేస్తుంది కొత్త ఆశలు తీర్చే కామధేనువులా
సరికొత్త ఆనందాలు అందించేందుకు ..
వచ్చేస్తుంది కొత్త సంవత్సరం .
ప్రకృతి పరవశిస్తూ సుగంధ భరితమైన
సువాసనలు వెదజల్లగా
సరికొత్త ఉత్తేజాన్ని తీసుకొస్తూ..
వచ్చేస్తుంది ఈ కొత్త సంవత్సరం 2023..!
మీకు , మీ ఆత్మీయులకు , శ్రేయోభిలాషులకు,
మరియూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..
-మంజుల పత్తిపాటి