శుభప్రదమైన రంజాన్ 

రంజాన్ మాసానికి స్వాగతం ఘన స్వాగతం పలకడానికి షాబాన్ మాసం నుండే అన్ని విధాలా సంసిద్ధం గా ఉండాలి. షబాన్ 15 వ తేదీకి ముందు వీలైనంత అధికంగా ఉపవాసాలు ఉండాలి. హాజ్రత్ అయేషా (రజి.ఆన్ )అంటారు. మహా ప్రవక్త (సఆ సం )అన్ని మాసాల్లో కంటే షాబాన్ మాసంలోనే అధికంగా ఉపవాసాలు ఉండేవారు.

2. శ్రద్ధాసక్తితో శుభప్రదమైన రంజాన్ నెలవంకను చూడ్డానికి ప్రయత్నించాలి. నెలవంక చూసాక ఇ దుఆ చదవాలి

“అల్లాహు అక్బర్, ఆల్లాహుమ్మా అహిల్లహు అలైన బిల్ ఆమ్ని  వల్ ఈమాని వస్సలామతి వల్ ఇస్లామి వత్తవ్ఫిఖి లిమాతుహిబ్బు వ తర్ జా రబ్బునా వ రబ్బుకల్లాహు ”

దేవుడు అందరికంటే గొప్పవాడు, దేవా! ఈ చంద్రుణ్ణి, మా పట్ల శాంతి, విశ్వాసంగల శ్రేయోస్కరమైన ఇస్లాం చంద్రునిగా ఉదయింప చేయి. నీకు అభిష్టమైన, ప్రీతికరమైన కార్యాలు చేసేందుకు మమ్మల్ని కటాక్షించు. ఓ చంద్రుడా! మా ప్రభువు, నీ ప్రభువు అల్లాహ్ యే “( తిర్మిజీ,ఇబ్ను ‘హిబ్బాన్ )

ప్రతీ మాసంలోను క్రొత్త చంద్రుడిని చూసినపుడు ఈ దువా చేయవచ్చును.

3. రంజాన్ మాసంలో ఆరాధన పట్ల ప్రత్యేక శ్రద్ధాశక్తులు చూపాలి. విధిగా చేసే నమాజులే కాకుండా నవాఫిల్ పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అత్యధిక పుణ్యఫలం ప్రాప్తించే కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉండాలి. ఇది దేవుని కరుణా, కటాక్షాలు వర్షింపచేసే మాసం. షాబాన్ మాసం చివరి తేదీలో మహా ప్రవక్త (స ఆ సం)రంజాన్ చంద్రుడిని చూస్తూ అన్నారు. ప్రజలారా! మీరు శుభప్రదమైన ఉత్క్రూష్టమాసాన్ని చూస్తారు. ఇ మాసంలోని ఒక్క రాత్రి వేయి మసాలకంటే కూడా ఉత్తమమైనది. దేవుడు ఇ మాసంలో ఉపవాసాలు పాటించటానికి విధిగా నిర్ణయించినాడు. రాత్రి పూట జాగరణ (తరావీవ్  కోసం ) నఫీల్ గా అభివర్ణించాడు. ఇ మాసంలో సహృదయంతో స్వయంగా ఒక సత్కార్యం చేసిన వ్యక్తి ఇతర మాసాల్లో “విధి”కి లభించే పుణ్యఫలాన్ని పొందుతాడు. ఇ మాసంలో ఒక విధిని నిర్వహిస్తే ప్రతిఫలంగా దేవుడు వానికి ఇతర మాసాల్లో ప్రాప్తించే 70 విధులకు సమానమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు.

4. మాసమంత పాటించే ఉపవాసల్ని అత్యంత శ్రద్ధాశక్తులతో భక్తి ప్రపత్తులతో పాటించాలి. ఒకవేళ అనారోగ్య తీవ్రత లేక షరీయత్ అనుమతించిన కారణంతో ఉపవాసాలు పాటించలేకపోయినా శుభదాయకమైన రంజాన్ పట్ల గౌరవసూచకంగా బహిరంగంగా భూజించకూడదు. ఇ పద్ధతిని కఠినంగా పాటించాలి. అంటే ఉపవాసం లేనివారు కూడా ఉపవాస దీక్షలో ఉన్నట్లుగానే ప్రవర్తించాలి.

5. ఖురాన్ పఠనాన్ని పత్యేకంగా పాటించాలి. దివ్య ఖురాన్ కూ ఇ మాసానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దివ్య ఖురాన్  ఈ మాసంలోనే అవతరించింది. అందువలన ఈ మాసంలో ఇతోధికంగా ఖురాన్ చదవటానికి ప్రయత్నించాలి. హాజ్రత్ జిబ్రాయీల్ (అలై స )ప్రతి సంవత్సరము రంజాన్లో మహా ప్రవక్త స ఆ సం )కు సంపూర్ణ ఖురాన్ వినిపించేవారు. వినేవారు. అయన అలై స )అఖరు సంవత్సరములో  మహా ప్రవక్త స ఆ సం )తో పాటు రెండు సార్లు పరిపూర్ణ పఠనం గావించాలి.

6. దివ్య ఖురాన్ ను నెమ్మదిగా, అవగాహన చేసుకుంటూ చదవటానికి ప్రయత్నించాలి. అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి.

7. తరావీవ్ నమాజ్ లో ఖురాన్ ను పూర్తిగా వినేందుకు ప్రయత్నంచాలి. రంజాన్ లో కనీసం ఒకసారి పూర్తిగా ఖురాన్ ను వినటం మహాప్రవక్త (స ఆ సం )ఆచారం.

8. తరావీవ్ నమాజ్ శ్రద్ధాశక్తులతో, చిత్తశుద్ధితో,వినయవిధేయాలతో చేసుకోవాలి. ఎలాగో, 20 రకాతులు పూర్తిచేయటానికి  ప్రయత్నించిరాదు.నమాజ్ చక్కగా చదవాలి. ఎందుకంటే మీ జీవితాల మీద దాని ప్రభావం పడి తీరాలి. దేవునితో మీ అనుబంధం పటిష్టతరమైపోవాలి. దేవుడు కరుణిస్తే తహజ్జుద్  నమాజ్ కూడా పాటించాలి.

9. దాన, ధర్మాలు చేయాలి. పేదలు, విధవల్ని, అనాధల్ని మిక్కుటంగా ఆదరించాలి. నిరుపేదలకు స‌హ్రీ స‌దుపాయం కల్పించాలి. మహాప్రవక్త, (స ఆ సం )అన్నారు. ఇది ఆదరణ, సానుభూతి  చూపే మాసం. హాజ్రత్ ఇబ్నే అబ్బాస్ (రజి ఆన్ ) ఇలా అంటారు.

10. ఈ మాసంలో ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. ప్రతి ఒక్కరి పట్ల జాలి, దయ, కరుణ, చూపించాలి. రంజాన్ మాసంలో హాజ్రత్ జీబ్రాయిల్ ప్రతిరాత్రి అయన (స ఆ స )వద్దకు వచ్చేవారు దివ్య ఖురాన్ పటించేవారు. వినేవారు. అయితే ఈరోజుల్లో ప్రవక్త (స ఆ సం)వేగంగా వీచే గాలి వలె  అమితంగా దాన ధర్మాలు చేసేవారు.

11. షబేఖాదర్ లో అధికంగా నవాఫిల్ నమాజులు పాటించాలి. ఖురాన్ పఠనం చేయాలి. దివ్య ఖురాన్ ఈ రాత్రిలోనే అవతిరించిందన్న ప్రాధాన్యత ఖురాన్ లో వుంది.

” మేము ఖురాన్ ను ఈ షబేఖదర్ లోనే అవతరింపచేసాము. షబేఖాదర్ అంటే వేయి మాసాల కంటే ఉత్తమమైనది. ఈ రాత్రి దూతలు, హాజ్రత్ జీబ్రాయిల్ విశ్వప్రభువు ఆజ్ఞ మేరకు ప్రతి మనిషి నిర్వహించేందుకు దిగి వస్తారు. ఉదయం అయ్యేవరకు శుభాశీస్సులు ప్రాప్తిస్తాయి. (ఆల్ khadr )

హాదీసు ప్రకారం షాబెఖదర్ రంజాన్ నెల చివరి పది రోజుల్లోని బేసి సంఖ్యకల రాత్రిళ్లలో ఎదో ఒకటి అయి ఉంటుంది. ఆ వేళ ఈ దువా చదవండి.

” అల్లాహుమ్మ ఇన్నాక ఆపువ్వున్ తుహిబ్బుల్ ఆఫ్వఫ ఆపుఅన్ని “(హిస్నే హిసీన్ )

”  దేవా! నీవు అమితంగా క్షమించేవాడివి క్షమించటం నీకు ప్రీతికరమైన. నీవు నన్ను క్షమించు”

హాజ్రత్ అనస్ (రజి. ఆన్) అంటారు.

ఓ సంవత్సరము రంజాన్ రాగానే మహాప్రవక్త (స ఆ సం )అన్నారు. మీకోసం ఒక మాసం వచ్చింది. అందులో ఒక రాత్రి వుంది. ఆ రాత్రి వేయి మాసాలాకంటే ఔన్నత్యం గలది. ఆ రాత్రి కోల్పోయిన వ్యక్తి సర్వపుణ్యాలను కోల్పోయిన వాడావుతాడు. ఆ రాత్రిలోని శుభాలను దౌర్భాగ్యుడైన వ్యక్తే కోల్పోతాడు. (ఇబ్ ను మాజా )

12. రంజాను అఖరు పదిరోజులలో ఎతేకాఫ్ చేయండి. మహాప్రవక్త (స ఆ సం )రంజాన్ చివరి పదిరోజులలో ఏతేకాఫ్ ఉండేవారు. హాజ్రత్ అయేషా (రజి ఆన్ )అంటారు. అఖరు భాగం రాగానే ప్రవక్త (స ఆ సం )రాత్రులలో అధిక సమయం మేల్కొని ఆరాధన చేసేవారు. తన సతీమణుల్ని కూడా మేల్కొనేవారు. శ్రద్ధాశక్తులతో, ఏకగ్రాతతో దేవుని ఆరాధనలో నిమగ్నూలయ్యేవారు ”

13. రంజాన్లో ప్రజల పట్ల అత్యంత అనురాగం, అభిమానం చూపాలి. పనివాళ్ళు, నౌకర్లకు అమితంగా సౌకర్యలు కల్పించాలి. విశాల హృదయంతో వారి అవసరాల్ని  తీర్చాలి. కుటుంబ సభ్యుల పట్ల కూడా ప్రేమ, దయ, జాలి, ఔదార్యం చూపాలి.

14. అత్యంత వినయం, విధేయత, శ్రద్ధాశక్తులతో, ఎక్కువగా దుఆ చేయాలి. దూర్రెమన్సూర్ అనే గ్రంధంలో ఉంది. శుభప్రదమైన రంజాన్ రాగానే మహాప్రవక్త (స ఆ సం )పరిస్థితి మారిపోయేది. నమాజుల సంఖ్య అధికమైపోయేది. దుఆ వేడుకోవటంలో వినయ వినమ్రతలు ఉట్టిపడుతుండేవి. దైవభితి అమితంగా అవరించిపోయేది.

హదిసులో ఇలా వుంది. “దేవుడు రంజాన్ లో దైవ సింహాసనాన్ని మొపే దూతలను అజ్ఞాపిస్తాడు. మీ ఆరాధనలు ఆపండి. ఉపవాసాలు పాటించేవారు దుఆలు చేస్తూ ఉంటే మీరు “అమీన్ ” అంటూ ఉండండి అని.

15. సద్ ఖ. ఫిత్రాలు సహృదయంతో ఇవ్వాలి. పండుగ నమాజ్ కు ముందే ఇవ్వాలి. ఇంకా చాలా ముందు ఇస్తే మంచిది. ఎందుకంటే పేదలు, ఆనాధలు, తమకు గల సౌకర్యంతో పండుగ అవసరాల్ని తీర్చుకోవటానికి వీలువుతుంది. అందరితో పాటు వారు కూడా ఈద్గాకి చేరుకుంటారు. పండుగ సంతోషాల్లో వారు కూడా పాల్గొనగలుగుతారు.హదిసులో వుంది. “మహాప్రవక్త (స ఆ సం )సద్ ఖ. ఫిత్రాను ఉమ్మత్ (సమాజం) కు అవసరమైనదిగా ఎందుకు ఖరారు చేసారంటే… ఉపవాస దీక్షలో వున్నవారు పొరపాటున పలికిన అస్లీల పదాలకు ప్రతిగా లభించే చెడు ఫలితాలు ప్రక్షాళనమైపోతాయి.. ఆలా నిరుపేదలకు, అనాధలకు, ఆహారం సమకూరుతుంది. (అబూ దావుద్ )

16. శుభప్రదమైన రంజాన్ రోజుల్లో మీరు ఎక్కువగా పుణ్యఫలం పొండటానికి చేసే ప్రయత్నంతో పాటు ఇతరులకు కూడా వాత్సల్యం, ప్రేమ, సానుభూతులతో, ఉపాయంతో పుణ్యకార్యాలు చేయడానికి ప్రోత్సహంచాలి. ఆలా పూర్తి వాతావరణమంతా దైవభక్తి, శుభశ్రేయస్సుల అభిలాష, సత్కార్యాలతో వీరజిల్లెల చేయాలి. ఈ విధంగా సమాజం రంజాన్ అమూల్య శుభాలు, శ్రేయస్సులతో అమితంగా ప్రయోజనం పొందాలి.

 

షేక్. బహర్ అలీ

ఆయుర్వేద వైద్య నిపుణుడు.

Leave A Reply

Your email address will not be published.