Khammam: హర్ దిన్ – హర్ ఘర్ ఆయుర్వేదిక్ ప్రోగ్రాం
Har Din - Har Ghar Ayurvedic Program
ఖమ్మం (CLiC2NEWS): క్రియేటివ్ హైస్కూల్ యాజమాన్యం శ్రీ కమలాకర్ రావు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు, హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేదిక్..యోగ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆధ్యాత్మిక పరంగా, సంస్కృతి,సంస్కార పరంగా, ఉండాలని యోగ మరియు ఆయుర్వేద ప్రోగ్రామ్ ని విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు మరియు వారితో ఆసనాలు, ప్రాణాయామము చేయించటం జరిగింది.
ప్రతిరోజు మనము ఆయుర్వేదం గురించి తెలుసుకోవడానికి.. శారీరక రోగాలను, మానసిక రోగాలను తగ్గించడానికి యోగా మరియు ఆయుర్వేద ప్రోగ్రాంలో రోగాలకు ఆయుర్వేద చిట్కాలు మరియు దినచర్య, రాత్రి చర్య, ఋతు చర్య, కాలానుగుణంగా వచ్చేటటువంటి జబ్బుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, నిరోధక శక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలి. వారికి యోగాసనాల గురించి వివరించాము.
-షేక్ బాహర్ అలీ
ఆయుర్వేద వైద్య నిపుణులు