శ్వేతపత్రం తప్పుల తడకగా ఉంది: హరీశ్‌రావు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శాసనసభలో బుధవారం శ్వేతపత్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై మాజి మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. . శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ధోరణిలో ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొత్త ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టి ఎన్నో ఆశలు కల్పించడంతో .. ప్రజలు నమ్మి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. ప్రజలు విశ్వాసంకు తగ్గట్టుగా ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగించాలన్నారు. శ్వేతపత్రంలో ప్రజలు.. ప్రగతికోణం లేదు. ఇందులో రాజకీయ ప్రత్యర్థలపై దాఇ.. వాస్తవాల వక్రీకరణే ఉందని హరీశ్‌రావు అన్నారు. దీనిని మన రాష్ట్ర అధికారులు తయారు చేయలేదని, ఆంధ్ర అధికారులతో నివేదిక తయారు చేయించారన్నారు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటి వేయమని ఆయన డిమాండ్ చేశారు.