HDFC: రెండు స్పెష‌ల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌.. గ‌రిష్టంగా 7.75% వడ్డీ!

ముంబ‌యి (CLiC2NEWS): హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అధిక వ‌డ్డీ రేట్ల‌తో రెండు స్పెష‌ల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప‌థ‌కాల‌ను తీసుకొచ్చింది. 35 నెల‌ల స్పెష‌ల్ ఎఫ్‌డి స్కీమ్‌పై సాధార‌ణ పౌరుల‌కు 7.2%, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 7.70% వ‌డ్డీ  వ‌స్తుంది. 55 నెల‌ల కాల వ్వ‌ధితో వ‌స్తున్న ఎఫ్ డి స్కీమ్‌పై 7.25% చొప్పున వ‌డ్డీ చెల్లించునున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అదేవిధంగా ఇత‌ర ఎఫ్‌డిల‌పై వ‌డ్డీ రేట్ల‌ను సైతం స‌వ‌రించింది. సీనియ‌ర్ సిజిజ‌న్ల‌కు అద‌నంగా 50 బేసిస్ పాయింట్లు వ‌డ్డీ అంద‌జేస్తామ‌ని పేర్కొంది. దీంతో సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 7.70% వ‌డ్డీ అందిస్తోంది.

ఈ రెండు ప‌థ‌కాలు కాకుండా రూ.2 కోట్లు వ‌ర‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7రోజుల నుండి 10 ఏళ్ల వ‌ర‌కు 3 నుండి 7% వ‌డ్డీని బ్యాంక్ అఫ‌ర్ చేస్తుంది. ఈ కొత్త ఎఫ్‌డి రేట్లు నేటి నుండే అమ‌లులోకి రానున్నాయని ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.