జలమండలిలో ఆరోగ్య శిబిరాలు
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని జలమండలి కార్యాలయంలో నాలుగు రోజుల పాటు ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నారు. ఆరోగ్య శిబిరం కార్యక్రమాన్ని జలమండలి ఎండి బుధవారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల క్షేమం కోసం ఏటా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. గతేడాది సైతం ఏర్పాటు చేశామని, అప్పుడు మంచి స్పందన లభించిందని తెలిపారు. బోర్డు పరిధిలో పనిచేసే ఉద్యోగులందరూ తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరాల్ని ప్రధాన కార్యాలయంతో పాటు ఎస్.ఆర్.నగర్, గోషామహల్, మారేడ్ పల్లి, పటాన్ చెరు కార్యాలయాల్లో ఆయా తేదీల్లో మొత్తం 24 రోజుల పాటు నిర్వహిస్తామని వివరించారు. ప్రతి ఉద్యోగీ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మొత్తం 21 రకాల పరీక్షలు :
ఘ్నల్ ఇన్సురెన్స్ బ్రోకింగ్ అండ్ రిస్క్ మేనేజ్ మెంట్, హెల్త్ ఇండియా టీపీటీ సంస్థల ఆధ్వర్యంలో సీబీపీ, ఈసీజీ, 2డీ ఈకో, టీఎంటీ, చెస్ట్ ఎక్స్ రే వంటి వాటితో కలిపి మొత్తం 21 రకాల పరీక్షలు చేస్తారు.
ఆరోగ్య శిబిరాల వివరాలు:
నేటి నుంచి శనివారం వరకు బోర్డు ప్రధాన కార్యాలయం..
మే 3 తేదీ నుండి 6వ తేదీ వరకు ఎస్ ఆర్ నగర్ లోని సర్కిల్ కార్యాలయం..
మే 10 నుంచి 13 వరకు గోషామహల్ డిస్పెన్సరీలో..
మే 17వ తేదీ నుండి 20 వరకు మారేడు పల్లి డివిజన్ ఆఫీసులో..
మే 24 నుండి 27 వ తేదీ వరకు పటాన్ చెరు జలమండలి కార్యాలయంలో శిబిరాలు నిర్వహించనున్నారు. కావున ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినిచేసుకోగలరని కోరారు. ఈ సమయంలో అందుబాటులో లేని వారి కోసం తిరిగి మే 31 నుంచి జూన్ 3 వ తేదీ వరకు బోర్డు కార్యక్రమంలో నిర్వహిస్తారు.