మన అందరి కోసం.. ఆరోగ్య చిట్కాలు

మనకోసం.. మన అందరి కోసం..   ఆరోగ్య చిట్కాలు

చికిత్సపరమైన పర్యావరణం సంతులనపరమైన దానికోసం మనము అక్కడ సాంబ్రాణి,గుగ్గిలం తో దూపం వేస్తాము. దానితో అక్కడ వాతావరణం చక్కగా ఉంటుంది. పర్యావరణ రక్షణ కోసమై ఇలాంటి చక్కని కార్యక్రమాలు చేయటం వలన గాలిలో ఉన్నటువంటి వైరస్ లాంటివి కూడా మన దగ్గరకు రాకుండా ఉంటాయి.

యజ్ఞాల వల స్వాభావిక జీవలయబద్ధత ఆధారంగా ప్రకృతి తన మొత్తం కార్యకలాపాలని వ్యవస్థీకృతమై ఒకే విధమైన స్వరలయాల్లోకి వస్తుంది. అందువల్ల ప్రతి చికిత్స కేంద్రానికి కనీసం ఒక యజ్ఞశాల అవసరం ఉంది. యజ్ఞం మానవుడికి మనసు మస్తిష్కము, రక్తాల్లోని జీవ రసాయనంపై ఆరోగ్యకరమైన ప్రభావం చూపుతుంది రోగకారక క్రిముల్ని సంహరించడానికి ఉపయోగపడుతుంది.

నిద్రించే సమయాల్లోనూ లేదా శ్వాసించే సమయాల్లోనా అలసట పోగొట్టటానికి కనురెప్పలు మూసుకొని అరికాళ్ళ వేళ్ళ నుంచి తల వరకు ఒక్కొక్కటి ప్రతిభాగానికి ఆజ్ఞాలు జారీ చేస్తూ శిథిలం చేస్తూ ఏ కార్యకలాపాలు జరగని ఒక శూన్యస్థితికి తీసుకువెళ్లాలి. అలాంటి స్థితిలో తీసుకునే విశ్రాంతి సుఖశాంతుల అనుభూతినిస్తుంది. 15 నిమిషాల తర్వాత ఒక్కొక్క అవయవాన్ని జాగృతం చేస్తూ లేచి ఐదు నిమిషాలు శాంతంగా ఉండాలి. ఆ తర్వాత అక్కడి నుంచి లేచి తేలికపాటి పనులేవైనా చేసుకోవాలి.

కాఫీ, టీ కి బదులు గోధుమలు మెంతులు ఒకేసారి ముకుట్లో వేసి తక్కువ మంట మీద చాలా సేపటి వరకు వేయించి దాన్ని దంచి పక్కన పెట్టాలి టీ బదులు తులసి పుదీనా ఆకుల్ని లేదా లెమన్ గ్రాస్ ని బాగా ఎండబెట్టి దంచాలి .టి కాఫీలు తయారు చేయడానికి మొదట వీటిని నీటిలో మరిగించాలి. తర్వాత పాలు బెల్లము లేదా యాలకలు సొంటి లేదా అల్లము దంచి ఉంచుకోవాలి. వీటిని కలిపి చేసుకుంటే ఇది అత్యుత్తమైన ఆరోగ్యమైన పానీయం కాగలదు.

బెల్లం ఉపయోగించి తయారుచేసిన అమృతాన్ని ఉపయోగించవచ్చు. అమృతం తయారు చేయడానికి ఒక కిలో బెల్లం చూర్ణం చేయాలి. ఒక 250 మిల్లి నీళ్లల్లో వేసి తక్కువ మంట మీద మరిగించాలి తీగపాకం కాగా ముందే దాన్ని దించాలి కొద్దిగా చల్లార్చించి దానిపై బట్ట కప్పి అవసరాన్ని బట్టి చల్లారిన అమృతాన్ని సీసాలో నింపుకోవాలి దీన్ని 7 రోజులు మించి వాడకూడదు ఎందుకంటే వారం రోజులకు మించి అమృతం బాగుండదు పాడైపోతుంది.

ఫలాలు లేదా దోశ, పాలకూర, బచ్చలకూర, కొత్తిమీర, తోటకూర, మెంతులు, క్యారెట్, టమాటాలు, కీర, సొరకాయ, యాపిల్ వంటి కాయగూరలు రసాలు ప్రయోగించాలి.

చట్నీ కొరకు కొబ్బరి యాభై గ్రాములు వెల్లుల్లి 4 గర్భాలు, కొత్తిమీర 10 గ్రాములు, క్యారెట్,లేదా ముల్లంగి 50 గ్రాములు ఊసిరీ 10 గ్రాములు, అల్లం పది గ్రాములు, కలిపి దంచి చట్నీ చేయాలి.

కాలుష్య నివారణకు వేప గులాబీ, జామ,కొబ్బరి చెట్టు, ఇలాంటి చెట్లను చక్కగా పెంచటం వలన కాయలు, పూలు లభిస్తాయి.పర్యావరణ కాలుష్యం నివారించబడుతుంది.

క్రిమిసంహారక మందులు వాడే బదులు వేపాకులు బూడిద,వేపాకు రొట్ట,లేదా పేడ నీళ్లు,చల్లవచ్చును.పొలంలో అన్ని వైపుల తులసి మొక్కలు నాటవచ్చును.ఈవిధమైన చర్యలు చేపట్టడంతో ఎటువంటి విషమ ప్రభావలుండవు.

 

-షేక్. బహార్ అలీ
 ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.