గోధుమలు వలన ఉపయోగాలు
![](https://clic2news.com/wp-content/uploads/2025/02/godhumalu.jpg)
ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధాసక్తులు పెరుగుతున్నాయి. ప్రతిరోజు వ్యాయామం చేయడం.. నడక, ఆహారం విషయంలో కూడా అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రజలు చిరుధాన్యాలవైపు మొగ్గుచూపిస్తున్నారు. చిరు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం వలన ప్రయోజనాలు గుర్తించారు. ఈ రోజు మనం గోధుమలు గురించి, వాటి వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
గోధుమలలో జాతీభేదం కలదు. ఎర్ర గోధుమలు, తెల్ల గోధుమలు, జవ్వ గోధుమలు, పొట్టి జవ్వ గోధుమలు అని కలవు. జవ్వ గోధుమలు అన్నముగా వండుకోని తిన్నచ్చు. మధుమేహరోగులకు వ్యాధిని ముదరనివ్వదు.. మరియు కురుపులు పుట్టకుండా కాపాడుతుంది. ఆరోగ్యవంతులు దీనిని సేవించిన శరీర కాంతి, బలము, ఎముకలకు పుష్టి, సకాల విరోచనము మొదలైన మంచి గుణములు ప్రసాదించును. స్వచ్ఛమైన పాలతో గోధుమ పరమాన్నము వండుకోని తిన్నచో శుక్ల వృద్ధి కలిగించి గుండె జబ్బులు రానివ్వదు. గోధుమ లను పొట్టుతోనే తింటే చాలా మంచిది.
-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు,