గుండె ఆరోగ్యానికి చేపలు తింటే మేలా..?

గుండె సంబంధిత ఇబ్బందులు, గుండె జబ్బులు ఉన్నవారు చేపలు తింటే మంచిదే అంటున్నారు నిపుణులు. చేపలలో ఉండే కొవ్వు ఆమ్లాలు గుండెజబ్బుల నివారణకు తోడ్పడుతాయని చెబుతున్నారు. చేపలలో లభించే కొవ్వు ఆమ్లాలు మన శరీరంలో ఉత్పత్తికావు. అవి బయటి ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. గుండెనొప్పి, గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బుల తీరును పరిశీలించిన పరిశోధకులు ఈ విధంగా తెలుపుతున్నారు. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి.
చేపలలో ఉండే విజమిన్ బి12, రైబోప్లోవిన్, నియాసిన్, బయోఇక్, థయామిన్ పుష్కలంగా ఉంటాయి. ఆస్తమాతో బాధపడేవారు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలున్నా చేపలు ఆహారంగా తీసుకోవచ్చు. చలికాలంలో చేపలు తీసుకోవడం వలన ఆనారోగ్య సమస్యల నుండి రక్షించుకోవచ్చు. వర్షాకాలంలో ఐతే తప్పకుండా చేపలు తింటారు. చేపలను ఏ రూపంలో తిన్నాసరే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.