మాంసం క‌న్నా బ‌చ్చ‌లి కూర మేలు..

మునగాకు కంటే పవర్ఫుల్ బచ్చలి కూర

తెలుగులో: బచ్చలి
హిందీలో: లాల్ బచ్చ్లు పోయే
సంస్కృతం: పోతకి
లాటిన్ :బాసేల్లా రుబ్రా లైన్నెయస్

కుటుంబం. Basellaceae.

భారతదేశంలోనే గాక అనేక చోట్ల బచ్చలిని ఆకుకూర కోసం పెంచుతారు. దీని తీగలు ఎరుపు, తెలుపు రకాలు ఉన్న విలువలు మాత్రం ఒక్కటే. ఇది మాంసాహారుల కంటే చక్కని పోషక విలువలు కలిగి ఉంటుంది. బచ్చలి శీతల గుణాన్ని కలిగి ఉంటుంది. బచ్చలి యందు
తేమా, ప్రోటీన్లు, ఫైబర్, ఖనిజ లవణములు, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, కాపర్, ఐరన్, పొటాషియం, సల్ఫర్, విటమిన్ ఏ, రైబో ఫ్లోబియన్, మరియు విటమిన్ సి ఉంటాయి.

అయోడిన్ మరియు లిసిధిన్ కూడా ఉంటాయి. ఇందులో ఏమైనో ఆసిడ్స్ అయిన అర్జీని హిస్టిడిన్, ఐసొల్యూ సిన్, ల్యూసిన్, లైసిన్, మీథియోనిన్,ట్రిప్టోపాన్, వాలిన్ కలవు.

బచ్చలి కూర పప్పుతో వండుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మాంసం ఇష్టం లేనివారు బచ్చలిని తిని ఆ లోటును పూడ్చవచ్చును.

ఉప‌యోగాలు:

  •  బచ్చలి రక్తస్రావాన్ని ఆపుతుంది బలాన్ని కలిగిస్తుంది
  • శుక్రాన్ని వృద్ధి చేస్తుంది. కోపాన్ని బరువుని పెంచుతుంది.
  • ఐరన్ మరియు ప్రోటీన్లు తగ్గుతల వల్ల అనేక రకాల సమస్యలు మన చిన్నారి పసిపాపలు ఎదుర్కొంటున్నారు. అతిసారము విరోచనాలు మరొక సమస్య ఇలాంటి వారందరికీ రోజు బచ్చలి రసము ఒకటి నుంచి మూడు చెంచాలు తాగించిన ఆ సమస్యలను అధిగమించవచ్చును.
  • అలాగనే రక్తహీనత రోగులకు కూడా బచ్చలి ఎంతో మేలు చేస్తుంది.
  • మాంసము గుడ్లు చేపలు తినలేని, శక్తి లేని పేదవాళ్లు బచ్చలని రోజు తినటం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు ఇందులో ఎన్నో అమినో ఆసిడ్స్ కలవు.
  • గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం బచ్చలి కూర తినటం గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరం, దీనివల్ల అబార్షన్ కాకుండా అధిక రక్తస్రావం కాకుండా కూడా ఉపయోగపడుతుంది.బచ్చలి ఆకులు ఉలువలు మరియు నిమ్మరసం కలిపి చక్కని సూప్ చేసుకుని త్రాగిన మూత్రపిండాలు రాళ్లు కరిగిపోతాయి.
  • ఇది పౌరుష గ్రంధి యొక్క పెరుగుదలను కూడా నిరోధిస్తుంది.
  • బచ్చలి ఆకు రసం మరియు పచ్చి కొబ్బరి నీళ్లు కలిపి తాగిన డయ్యురిగ్గా పనిచేస్తుంది.
  • హైపర్ టెన్షన్, టాక్సిమియా, ప్రెగ్నెన్సీ, గుండె జబ్బులు, గనేరియా, మూత్రం కష్టంగా వెలవటం లాంటి జబ్బులు తగ్గుతాయి.
  • బచ్చలి ఆకులరసము, బ్రహ్మీ ఆకు రసం కలిపి పిల్లలకిచ్చిన జ్ఞాపక శక్తి పెరుగుతుంది
    చక్కగా నిద్ర పడుతుంది.
  • అంతేకాకుండా రుమటైడ్ అర్ధరైటీస్ నొప్పి తగ్గిస్తుంది.
  • బచ్చలి ఆకు రసం నందు పంచదార కలిపి త్రాగిన పండ్ల నుండి రక్తం కారడం తగ్గుతుంది.
    బచ్చలి ఆకుల్ని నమిలి మ్రింగిన దంత రోగాలు నిరోధించబడతాయి
  • బచ్చలి ఆకులను మెత్తగా నూరి గడ్డలపై కఠిన గడ్డలు మెత్తబడి పగులుతాయి.
  • బచ్చలి ఆకుల రసము మరియు ఉప్పు కలిపి డికాషన్ చేసుకొని గార్గింగ్ చేసిన గొంతు నొప్పి, ట్రాన్సిల్స్ వాపు, జలుబు గొంతు గరగర తగ్గుతుంది.

-షేక్. బహార్ అలీ
 ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.