జిహెచ్ఎంసి పరిధిలో భారీగా విద్యుత్ వినియోగం..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో విద్యుత్ వినియోగం భారీగాపెరిగినట్లు అధికారులు తెలియజేశారు. జిహెచ్ ఎంసి పరిధిలో గురువారం మధ్యాహ్నం రికార్డు స్థాయిలో 4,053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మైలురాయిని అధిగమించింది. 2023 ఏప్రిల్ 18న గరిష్ట డిమాండ్ 3,471 మెగావాట్లు. ప్రస్తుతం 582 మెగావాట్ల అధిక విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికి ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖకు అభినందనలు తెలియజేశారు. మేనెలలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ సిబ్బంది.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.