శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
హైదరాబాద్(CLiC2NEWS): శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సోమవారం అక్రమంగా తరలిస్తున్న రెండు కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని తెలుస్తుంది. ఎయిర్పోర్ట్ క్యాటరింగ్ ఉద్యోగి వద్ద నుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలింకా తెలియాల్సి ఉంది.