భారీగా బంగారం స్మగ్లింగ్: రూ. 5.80 కోట్ల బంగారం స్వాధీనం
అమరావతి (CLiC2NEWS): విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ పరిధిలో అతిపెద్ద స్మగ్లింగ్ రాకెట్‌ను అధికారులు ఛేదించారు. మూడు కార్లలో అక్రమంగా తరలిస్తున్న సుమారు. 5.8 కోట్ల విలువ కలిగిన బంగారాన్ని పట్టుకున్నారు. చెన్నై నుంచి గుంటూరు, రాజమహేంద్రవరానికి భారీగా బంగారం, వెండి తరలిస్తున్నట్లు ఈ నెల 24న కస్టమ్స్ అధికారులకు సమాచారం అందగా.. బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన మూడు కార్లను తనిఖీ చేశారు. కార్లలోని సీట్ల కింద భాగంలో ప్రత్యేక అరలను ఏర్పాటు చేసి వాటిలో బంగారం దాచిపెట్టారు. మూడు కార్లలో కలిపి మొత్తం 10.77 కిలోల బంగారం అధికారుల స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వీటి విలు రూ. 5.8 కోట్లు ఉంటుందని తెలిపారు.