క‌రీంన‌గ‌ర్ జిల్లాలో భారీ వ‌ర్షం..

క‌రీంన‌గ‌ర్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌లు చోట్ల భారీ వ‌ర్షం కురిసింది. ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కుర‌వ‌టం వ‌ల‌న అనేక చెట్లు నేల‌కొరిగాయి. ప‌ట్ట‌ణంలోని గీతా భ‌వ‌న్ సెంట‌ర్‌లో ఉన్న హోర్డింగ్ సైతం కూలిపోయింది. రాముడి ప‌ట్టాభిషేకం ఆవిష్క‌రించేలా ఏర్పాటు చేసిన 70 అడుగుల ఎత్తైన లుమినార్ నేల‌కొరిగింది. ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌బోయే బ్ర‌హ్మోత్స‌వాల‌లో రాముడి ప‌ట్టాభిషేకాన్ని ఆవిష్క‌రించేలా సుమారు రూ. 45 ల‌క్ష‌లు పెట్టి నిర్మించారు.

Leave A Reply

Your email address will not be published.