తెలంగాణలో రాబోయో నాలుగు రోజుల్లో భారీ వర్షాలు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎల్లో అలర్డ్ జారీ చేసింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి కొమోరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.