బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షాలు..
జలమయమయిన ఐటి కారిడార్‌లు

బెంగళూరు (CLiC2NEWS): నిన్నటిని నుండి కురుస్తున్న ఎడతెరపని వర్షాల కారణంగా కార్ణాటక రాజధాని బెంగళూరులోని రహదారులన్నీ జలమయమయ్యాయి. అనేక ప్రాంతాలలో వరదనీరు భారీ చేరుకుంది. కేవలం 6, 7 రోజుల వ్యవధిలోనే బెంగళూరు రెండవసారి జలమయవడంతో, రోడ్లపైకి నీరు చేరి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు, అధికారులు వర్హ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. నగరంలోని పలు ఐటి కంపెనీల్లోకి కూడా వర్షపు నీరు చేరుకుంది. వర్షం కారణంగా తమ కంపెనీలకు సుమారు రూ. 225 కోట్ల నష్టం వాటిల్లినట్లు బెంగళూరు ఔటర్ రింగ్‌రోడ్ కంపెనీస్ అసోసియేషన్ తెలియజేశారు. వీరు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి లేఖ రాశారు. దీనిపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని సిఎం హామీ ఇచ్చారు.