తెలుగు రాష్ట్రాలకు నిలిచిపోయిన రాకపోకలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నా భారీ వర్షాలకు రెండు రాష్ట్రాలకు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ-ఎపి సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కోదాడ నుండి వరదనీరు దిగువకు భారీగా ప్రవహిస్తోంది. ఎన్‌టిఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హైవేపై మోకాళ్ల లోతులో వరద నీరు చేరింది. విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రాకుండా పోలీస్ రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.