10,12 త‌ర‌గ‌తుల టాప‌ర్లకు హెలికాప్ట‌ర్ రైడ్‌..

రాయ్‌పుర్‌ (CLiC2NEWS): ఛ‌తీస్‌గ‌ఢ్ సిఎం భూపేశ్ బ‌ఘేల్ ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. గ‌త మే నెల‌లో సిఎం  10,12 త‌ర‌గ‌తుల‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన 10 మంది విద్యార్థుల‌ను హెలికాప్ట‌ర్‌లో తిప్పుతామ‌ని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ఉత్త‌మ ఫ‌లితాలు సాధించిన విద్యార్థుల‌ను ప్ర‌భుత్వం హెలికాప్ట‌ర్‌లో ప్ర‌యాణించే అవ‌కాశం క‌ల్పించింది. దీంతో విద్యార్థులు సంతోషానికి అంతులేదు. తొలిసారి హెలికాప్ట‌ర్ ఎక్కినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని అన్నారు.

ఈ సంద‌ర్భంగా సిఎం విద్యార్థుల‌ను ఉద్దేశించి.. 10,12 త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ఉత్త‌మ ఫ‌లితాలు సాధించిన వారిని హెలికాప్ట‌ర్‌లో తిప్పుతామ‌ని ఇచ్చిన మాట ప్ర‌కారం నెర‌వేర్చాం. మొత్తం 125 మంది విద్యార్థులు ఈ హెలికాప్ట‌ర్ రైడ్‌ను ఆస్వాదిస్తారు. అంటూ ట్వీట్ చేశారు.

1 Comment
  1. binance sub account says

    Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.

Your email address will not be published.