గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి హైకోర్టు అనుమతి
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/high-court.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసినదే. ఫలితాల వెల్లడికి హైకోర్టు అనుమతించింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదం నేపథ్యంలో టిఎస్‌పిఎస్‌సి అప్పీలుపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటర్ దాఖలు చేయలని టిఎస్‌పిఎస్‌సిని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సంక్రాంతిలోపు ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.