మే 20 వ‌ర‌కు ఉపాధ్యాయుల‌కు సెల‌వులు ర‌ద్దు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సెల‌వులు ర‌ద్దు చేసింది. మే 20 వ‌ర‌కు సెల‌వుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీకి మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్న‌ట్లు పేర్కొంది.

రాష్ట్రంలోని పాఠ‌శాల‌ల‌కు మే 6 నుండి జులై 3 వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టిస్తూ పాఠ‌శాల విద్యాశాఖ శ‌నివారం ఆదేశాలు జారీ చేసింది. జులై 4 నుండి కొత్త విద్యాసంవ‌త్స‌రం ప్రారంభం కానుంది. ప్ర‌భుత్వ తాజా ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో మే 20 త‌ర్వాతే ఉపాధ్యాయుల‌కు సెల‌వులు అందుబాటులోకి రానున్నాయి.

1 Comment
  1. Saleem khan says

    It’s excellent news coverage platform.
    One our issue is there. తెలంగాణ రాష్ట్రం లో నిర్వహించిన మొదటి TRT-2017 లో నాణ్యమైన రాష్ట్ర టాప్ ర్యాంకర్లైన విద్వాన్ విశారద అభ్యర్థులకు జీఓ 25 వల్ల తీవ్ర అన్యాయం జరిగింది. పూర్తి వివరాలు తెలియజేస్తాను. గుడ్డి ప్రభుత్వం ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. నా నెంబర్ 7981921846.

Your email address will not be published.