రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు! : మంత్రి కెటిఆర్
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/WARANGAL-JOURNLISTS-WITH-KTR.jpg)
వరంగల్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయని.. ఎవరూ ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చెందొద్దని రాష్ట్ర మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. శనివారం వరంగల్ జిల్లాలోని టియుడబ్ల్యుజె నేతలు ఇళ్ల స్థలాలు, జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం మంత్రి కెటిఆర్‌ను కలిశారు. హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల గురించి నిన్ననే మాట్లాడినట్లు తెలిపారు. జెఎన్‌జె సొసైటితో సహా ప్రతి జర్నలిస్టుకు ఇళ్లు అందించే దిశగా త్వరలో చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ సొసైటి భూములు ఎక్కడ కేటాయించారో వాటి వివరాలు చెబితే భూమి ధర చెల్లింపునకు ఖాతా నెంబర్ వెంటనే ఇవ్వాలని అధికారులకు సూచించారు.