AP: వాగు దాటుతుండగా ముగ్గురు గల్లంతు

దేవీపట్నం (CLiC2NEWS): తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కొండమొదలులో విషాదం చోటు చేసుకుంది. బడిగుంట-ఆకూరి గ్రామాల మధ్యనున్న వాగును దాటుతుండగా ముగ్గురు గల్లంతయ్యారు. వాగు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వాగులో నీరు పొంగడంతో మహిళతో పాటు ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టగా.. ఒకరి మృతదేహం లభ్యం అయింది. మిగతా ఇద్దరి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.