TS: ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని వాహనదారులకు శుభవార్త. చలాన్ల చెల్లిపులపై భారీ డిస్కైంట్ను ప్రకటించింది. ద్విచక్ర వాహనదారుల పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల పై 80 శాతం రాయితీని ప్రకటించింది. డిసెంబర్ 26 నుండి పెండింగ్ చలాన్లను డిస్కౌంట్ తో కట్టే అవకాశం కల్పించారు. ఆర్టిసి డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్, ద్విచక్రవాహన దారులకు 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60%, లారీలు, ఇతరల హెవీ వాహనాలకు 50% డిస్కొంట్ ఇవ్వనున్నరు. 2022లో కూడా చలనాలపై రాయితీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ప్రస్తుతం కూడా రాయితీని ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.