హైదరాబాద్ శివార్లలో భారీ అగ్ని ప్రమాదం.. దట్టంగా కమ్మిన పొగలు

హైదరాబాద్ (CLiC2NEWS): నగర శివార్లలోని పెద్దఅంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఅంబర్‌పేట్‌లో ఉన్న స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అగ్నికీలలు అంతకంతకు పెరిగి గోదాం మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. నిమిషాల వ్యవధిలో దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను ఆవహించింది. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించిన ఫైర్ సిబ్బందిని పొగ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ ప్రాంతం అంతా దట్టంగా పొగలు అలముకున్నాయి. భారీగా శబ్ధాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మంటల ధాటికి గోదామ్‌లోకి ప్రవేశించే వీలు లేకపోవడంతో అధికారులు జేసీబీల సహాయంతో గోడలను కూల్చివేస్తున్నారు. మరోవైపు పొగ.. వ్యాపించడంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆస్థినష్టం భారీగా జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
Wow, amazing weblog structure! How lengthy have you ever been blogging for? you made blogging look easy. The whole look of your web site is magnificent, let alone the content!!