బాపట్ల జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..

మార్టూరు (CLiC2NEWS): బాపట్ల జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని మార్టూరు హైవేలో పేలుడు పదార్థాల నిల్వలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ పరిశ్రమలోని గిడ్డంగిలో వాటిని నిల్వ ఉంచినట్లు నిఘా విభాగం అధికారులు జిల్లా ఎస్పికి సమాచారం అందించారు. పేలుడు పదార్థాలు నిల్వలు ఉన్న గిడ్డంగి స్థానిక మండల స్థాయి వైఎస్ ఆర్ పార్టి నేతకు చెందినట్లు సమాచారం. సదరు వ్యక్తికి గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గ్రానైట్ వ్యాపారం ముసుగులో జిలెటెన్ స్టిక్స్ అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గిడ్డంగిలో టన్నుల కొద్దీ జిలెటెన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల నిల్వకు సంబంధించిన ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.