బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి 2.20 కిలోల బంగారు కిరీటం..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని బల్కంపేట ఎల్లమ్మకు 2.20 కిలోల బంగారు కిరీటం సమర్పించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమ్మవారి ఆలయం వద్ద నిర్మించిన షాపులను మంత్రి ప్రారంభించారు. ఈ సంర్బంగా ఆయన మాట్లాడుతూ..
అమ్మవారి కల్యాణోత్సవం జూన్ 20వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ ప్రధాన ద్వారాలకు వెండి తాపడం.. అమ్మవారికి కిరీటం సమర్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. దాతల సహకారంతో నిర్మించిన 34 షాపులను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ షాపులను చిరువ్యాపారులకు ఉచితంగా కేటాయించనున్నారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలతో బంగారు కిరీటం చేయించనున్నట్లు మంత్రి తెలిపారు.