72 గంట‌ల నిరాహార దీక్షను చేప‌ట్టిన ఎమ్మెల్సీ క‌విత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): భార‌త రాష్ట్ర స‌మితి ఎమ్ఎల్‌సి క‌విత ధ‌ర్నాచౌక వ‌ద్ద 72 గంట‌ల నిరాహార దీక్ష‌ (hunger strike)ను చేప‌ట్టారు. ముందుగా బిఆర్ అంబేద్క‌ర్ , పులే, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ విగ్ర‌హాల‌కు క‌విత నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ఈ రోజు చేసే పోరాటం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు. అందరి ఆకాంక్ష ఒక్క‌టేన‌ని, స్థానిక ఎన్నిక‌ల్లో 42% బిసి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాలి.

తెలంగాణ‌లో ప్ర‌తి ఒక్క‌రికీ రాజ్యాధికారంలో వాటా కావాలి. ఆర్ధిక అవ‌కాశాలు రావాలి. స‌మాజంలో స‌గ భాగం బిసిలు ఉన్నార‌ని, వాళ్ల‌కు రాజ‌కీయంగా స‌మ ప్రాధాన్యం ద‌క్కాల‌నే సంక‌ల్పంతో దీక్ష చేస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. బిసి బిల్లుల‌పై బిజెపి లేవ‌నెత్తిన అనుమానాల‌ను సిఎం నివృత్తి చేయాల‌ని ఆమె కోరారు. అంతేకాకుండా ముస్లింల‌కు అద‌నంగా 10% రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని సిఎం హామీ ఇవ్వాల‌న్నారు.

కామారెడ్డి డిక్ల‌రేష‌న్‌లో చెప్పిన‌ట్లు బిసిల‌కు న్యాయం చేయాల‌ని గ‌త కొన్ని నెల‌లుగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంను కోరుతున్న‌ట్లు క‌విత తెలిపారు. కానీ.. రాష్ట్ర ప్ర‌భుత్వం బిజెపి మీద నెపం నెట్టి త‌ప్పించుకోవాల‌ని చూస్తోంద‌న్నారు.

త‌ప్ప‌క చ‌ద‌వండి : Prayagraj: ఉప్పొంగిన‌ గంగ‌!

 

1 Comment
  1. […] త‌ప్ప‌క చ‌ద‌వండి: 72 గంట‌ల నిరాహార దీక్షను చేప‌ట్టిన ఎమ్… […]

Leave A Reply

Your email address will not be published.