అంబర్‌పేటలో వృద్ధ దంపతుల దారుణహత్య

హైదరాబాద్ (): నగరంలోని అంబర్‌పేటలో వృద్ధదంపతులు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. అంబర్‌పేట సాయిబాబా నగర్ కాలనీలో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. మూడంతస్తుల భవనంలో లింగారెడ్డి, ఊర్మిళాదేవి వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. వీరిని గుర్తు తెలియని దుండగులు తలపై బాది, గొంతుకోసి దారుణంగా హత్యచేసి నట్లు సమాచారం. దొంగతనానికి వచ్చిన దుండగులే హత్య చేసి ఉంటారని .. మూడు రోజుల కిందట ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారలు సేకరిస్తున్నారు.
Comments are closed.