గచ్చిబౌలి: సెంట్రల్ యూనివర్సిటి వద్ద ఉద్రిక్తత..
యూనివర్సిటి భూముల అక్రమ వేలంపాటను నిలిపివేయాలి.

హైదరాబాద్ (CLiC2NEWS): గచ్చిబౌలిలోని హైదరాబాద్‌సెంట్రల్ యూనివర్సిటి విద్యార్థుల నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో వర్సిటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటి భూముల అక్రమ వేలంపాటను నిలిపివేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థులు నిరసన తెలిపేందుకు ర్యాలీగా తరలివచ్చారు. ఈ ర్యాలీని గచ్చిబౌలి పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థులకు , పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారికి యూనివర్సిటి లోని ఆస్పత్రిలో అందిస్తున్నట్లు సమాచారం.